మూసీ నదిగా మారిన కేసీ కెనాల్… సిపిఐ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో ని కేసీ కెనాల్ మొత్తం కూడా డ్రైనేజీ వాటర్ తో కర్నూలు నగర ప్రజల ఆరోగ్యాలు పాడు చేసే విధంగా దుర్గంధం వెదజల్లుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం. డ్రైనేజ్ కాలువ నీళ్లు మళ్లించాలని ఆలోచన చేయకపోవడం నగరంలోని డ్రైనేజ్ వాటర్ అంతా కేసీ కెనాల్ లో కి వదిలేయడంతో ఈరోజు కర్నూలు నగరంలోని కేసీ కెనాల్ మొత్తం కూడా విపరీతమైన దుర్వాసనలతో చెత్తాచెదారాలతో నిండిపోయి ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తున్నదని నగరంలో విపరీతంగా దోమల బెడద పెరిగిందని తక్షణమే కేసీ కెనాల్ ని శుద్ధిచేయాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మురికి కాలంలో దిగి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోసిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు k. జగన్నాధంసిపిఐ నగర కార్యదర్శి ,పి రామకృష్ణారెడ్డి , నగర సహాయ కార్యదర్శి లు, సి మహేష్ ,డి శ్రీనివాసరావు ,నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు ఈశ్వర్ బిసన్న అన్వర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ,కే శ్రీనివాసులు ,సురేంద్ర కృష్ణ రామాంజనేయులు గౌడు దొడ్డిపాడు భాష శ్రీకాంత్ బాలస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .జగన్నాధం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలోని కేసీ కెనాల్ కాలువ నందు ప్రవహిస్తున్న డ్రైనేజ్ వాటర్ ని తక్షణమే మున్సిపల్ అధికారులు మళ్లించాలని లేకపోతే మూసీ నదిగా మారి నగరంలో ని ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీసే విధంగా కేసీ కెనాల్ ఉపయోగపడుతుందని తక్షణమే కలెక్టర్ మంత్రిగారు స్పందించి కేసీ కెనాన్ శుద్ధికై కృషి చేయాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కేసీ కెనాల్ శుద్ధికై ఆందోళన చేపడతామని నగరంలోని మేధావులను ప్రజలను కలుపుకొని ఉద్యమం చేపడతామని వారి సందర్భంగా హెచ్చరించారు.