విద్యారంగ సమస్యలపై మంత్రి తక్షణ చర్యలు చేపట్టాలి.. ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : ప్రభుత్వ విద్యా రంగం తీవ్రంగా నష్టపోవడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలపై దిద్దిపాటు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం( ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ,ప్రధాన కార్యదర్శి జి వి సత్యనారాయణ ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, విద్యా సంవత్సరం ప్రారంభమై ఒక నెల గడుస్తున్నదని,గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ముఖ్యంగా జీవో 117 వల్ల, మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం వల్ల ఇంకా మరి కొన్ని నిర్ణయాలు తీవ్రమైన ఇబ్బందులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరియు ఉపాధ్యాయులు గురయ్యారని, విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం వెంటనే ఏర్పాటు చేసి సూచనలు సలహాలు తీసుకుని తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ మంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు జీవో 117 నురద్దు చేయాలని, మూడు నాలుగు ఐదు తరగతులను విలీనం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి హై స్కూల్ కు హెడ్మాస్టర్ మరియు పిడి పోస్టులు కేటాయించాలని, హై స్కూల్ ప్లస్ లలో రెగ్యులర్ ప్రాతిపదికన లెక్చరర్లను నియమించాలని,ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్స్ ను నియమించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని, డిఈఓ పూల్ లో ఉన్న పండిట్ల అప్ గ్రేడేషన్ కు చర్యలు తీసుకోవాలని, అన్ని పాఠశాలలో తెలుగు మీడియం కొనసాగించాలని తదితర డిమాండ్లను వారు గుర్తు చేశారు. వెంటనే ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని,ఈ నెల 16న అందరికి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.