NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

1 min read

ఉంగుటూరు ఎమ్మెల్యే  ధర్మరాజుతో కలిసి పరిశీలన

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : శనివారం ఉంగుటూరు మండలం చోబ్రోలులో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజుతో కలిసి పరిశీలించారు.  ఇసుక స్టాక్ పాయింట్ లో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని, అదే విధంగా స్టాక్ పాయింట్ వద్ద ఫిన్సింగ్ వేయించి కట్టుదిట్టమైన ఏర్పాటు, వాహనాల రాకపోకలకు ముఖద్వారం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక స్టాక్ పాయింట్ వద్ద స్ధానిక తహశీల్దారు, రెవిన్యూ సిబ్బంది పర్యవేక్షణ చేయాలన్నారు.  జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇసకు స్టాక్ పాయింట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చేబ్రోలు స్టాక్ యార్డ్ కు తాడిపూడి నుంచి ఇసుకను రవాణా చేయడం జరుగుతుందన్నారు.  ఈ నేపద్యంలో ఇసుక రీచ్ నుండి ఏలూరు జిల్లాలోని ఇసుక నిల్వ కేంద్రాల వద్దకు రవాణా,  నిల్వచేసి నిల్వ కేంద్రం నుండి రవాణా వాహనాల్లో లోడ్ చేయుటకొరకు లాటరీ పద్దతిన ఏజెన్సీని నియమించేందుకు ధరఖాస్తులు కోరడం జరిగిందన్నారు. అనంతరం చేబ్రోలు గ్రామంలో పారిశుధ్య మెరుగుకు తీసుకోవల్సిన చర్యలపై గ్రామ సర్పంచ్ రాంధే లక్ష్మిసునీతతో కలెక్టర్ సమీక్షించారు.  ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి రీసైక్లింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. అనంతరం చేబ్రోలులోఇసుక స్టాక్ యార్డ్ ఏర్పాటు నేపద్యంలో సమీపంలోని టైల్స్ పరిశ్రమ వద్ద రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.  జిల్లా కలెక్టర్ వెంట తహశీల్దారు పి. రఘుకుమార్, తదితరులు ఉన్నారు.

About Author