ఐటీ మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఏపీ పోలీసుల సంఘం నాయకులు
1 min readపోలీసుల సమస్యలు పరిష్కరించాలని వినతి
ముఖ్యమంత్రి, హోంమంత్రి కి వివరించి పరిష్కరిస్తానని హామీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘ ఎగ్జిక్యూటివ్ సభ్యులు 14వ బెటాలియన్ ప్రెసిడెంట్ పెద్దయ్య , 6వ బెటాలియన్ ట్రెజరర్ శేఖర్ , ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, జి ఆర్ పి ప్రెసిడెంట్ సుబ్బారావు కలిసి పోలీసు సిబ్బంది యొక్క సమస్యలను మంత్రి నారా లోకేష్ కు వివరించడం జరిగింది. ఈ విషయమై లోకేష్ సానుకూలంగా స్పందించి పోలీస్ సిబ్బందికి సంబంధించిన సమస్యలు చాలా ముఖ్యమైనవని. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి తో మరియు రాష్ట్ర హోం మంత్రితో చర్చించి మీ సమస్యలను కచ్చితంగా పరిష్కారంచే విధంగా కృషి చేస్తాననిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.