PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్వాడీలు వివిధ కార్మికుల ఉద్యోగ భద్రత… కోరికలను అమలు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రతి కార్మికుల పొట్టను కొట్టిందని ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం టిడిపి ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు వేతనాలు గ్రాట్యూటి. పిఎఫ్. కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని కోరుతూ కార్మికుల కోర్కెల దినం పాటించాలని ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బుధవారం నాడు గడివేముల మండల కేంద్రంలో ఆటో వర్కర్స్ యూనియన్ హమాలి వర్కర్స్. అంగన్వాడీలు ఆశ వర్కర్లు కొత్త బస్టాండ్ నుండి  తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తాసిల్దార్ జమానుల్లా ఖాన్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ పెద్ద ప్రభుత్వాలు డిమాండ్లు పరిష్కారం చేయలేదని పైగా హక్కుల కోసం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే జులుం ప్రదర్శించాయని ఆరోపించారు ఇప్పటికైనా కొత్త ప్రభుత్వ హయాంలో తమ కోరికలను అమలు చేయాలని టిడిపి ప్రభుత్వం హామీ ఇచ్చిందని వాటిని పరిష్కరించాలని కోరారు ముఖ్యంగా ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని బడ్జెట్ ను పెంచాలని. అంగన్వాడిలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. 42 రోజుల సమ్మె కాలానికి ప్రభుత్వం మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలకు జీవో ఇవ్వాలని. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆశా వర్కర్లు ఆటో వర్కర్లకు వృత్తిపరమైన రక్షణ ఏర్పాటు చేయాలని. అలాగే మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా పోషణ ట్రాక్ అప్ ను తెచ్చి ఆధార్ లింక్ చేసి లబ్ధిదారుల లిస్టు తగ్గించి ఐసిడిఎస్ లో ప్రైవేటు స్వచ్చంద సంస్థలను ప్రోత్సహిస్తున్నారని ఐసిడిఎస్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు గూడ వసంతలక్ష్మి. రాములమ్మ. పుష్పావతి. ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు . హుస్సేన్ సాహెబ్. గోకార్ సాహెబ్ . ఆశ వర్కర్ల నాయకురాలు. చెన్నమ్మ ఆశ బి. హమాలి యూనియన్ తరపున మహేంద్ర చిన్నన్న పాల్గొన్నారు.

About Author