చిన్నారి వాసంతి అత్యాచారం..హత్య
1 min read-నిందితులు ముగ్గురు మైనర్ బాలురు
-ముచ్చుమర్రి గ్రామంలో విషాద ఛాయలు
-దొరకని బాలిక అమృతదేహం -ఎంతటి వారి కైనా శిక్ష పడాల్సిందే..ఎంపీ ఎమ్మెల్యే
-రంగంలోకి ఆరు బృందాలు
-మరో నాలుగు బృందాలు ఏర్పాటు జిల్లా ఎస్పీ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తొమ్మిది ఏళ్ల చిన్నారి అత్యాచారం హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా పగిడాల మండల పరిధిలోని ముచ్చుమర్రి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన బోయ మద్దిలేటి సుజాతమ్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు కుమారుడు రెండవ కూతురు వాసంతి(9) 5వ తరగతి చదువుతుంది.పార్కులో పిల్లలతో పాటు ఆడుకుంటుండగా వాసంతి అదృశ్యం అయింది.గత 4 రోజులుగా కనిపించకుండా పోయిన చిన్నారి వాసంతి మిస్ట రీని పోలీసులు చేదించారు. అనుమానితులైన ముగ్గురు మైనర్ బాలురులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.వీరంతా 15 ఏళ్ల లోపు ఉన్నవారే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది.అవును మేమే బాలికను తీసుకెళ్లాం అత్యాచారం చేసిన తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో వేశామని ఒక బాలుడు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇంకా పూర్తి వివరాలు మృతదేహం దొరికిన తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. బుధవారం ఉ 6 గం.ల నుంచి బృందాలు ముమ్మరం చేశారు.
పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే..బైరెడ్డి ఈ ప్రాంతాన్ని ఎంపీ శబరి,ఎమ్మెల్యే గిత్త జయ సూర్య,బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆత్మకూరు ఆర్డీవో దాసు ప్రాంతాన్ని పరిశీలించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఇలాంటి సంఘటనలు మరెక్కడ కూడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.ఈ సంఘటన దుర దృష్టకరమని హోంమంత్రి అనితతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడారు.తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులతో వారు మాట్లాడారు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని వారు తెలిపారు.
మరో 4,5 బృందాలు ఏర్పాటు:జిల్లా ఎస్పీ
బుధవారం మధ్యాహ్నం సంఘటన కాల్వ ప్రాంతాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి పరిశీలించి సిబ్బందికి సూచనలు తెలియజేశారు.తర్వాత తల్లి దండ్రులతో ఎస్పీ మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాక్ష్యా దారాలు సేకరించేందుకు మరో నాలుగు ఐదు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు వీటి పాత్రలో ఎవరు ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం దాన్ని బట్టి ముందుకు వెళ్తామని జిల్లా ఎస్పీ అన్నారు.తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరం ఆరు బృందాలు ఏర్పాటు
ఎత్తిపోతల కాలంలో చిన్నారి వాసంతి మృతదేహం కొరకు కాల్వ వెంట ఎన్డిఆర్ఎఫ్ బృందాలు 10 బోట్లు సహాయంతో గజ ఈతగాళ్లు ఉదయం నుంచి గాలింపు ముమ్మరం చేస్తున్నారు.ఇంకా చిన్నారి మృతదేహం జాడ కనిపించలేదు.ఈ ఘటనపై టీం లో ఆత్మకూరు డిఎస్పీ శ్రీనివాసరావు,సీఐలు విజయభాస్కర్,ప్రకాష్ కుమార్, మిడుతూరు,బ్రాహ్మణ కొట్కూరు,ముచ్చుమర్రి, జూపాడుబంగ్లా ఎస్సైలు మరియు సిబ్బంది అక్కడే ఉండి గాలింపు చేయిస్తున్నారు.సంఘటన జరిగిన ప్రదేశం దగ్గర ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ సంఘటన ముచ్చుమర్రి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వీటిలో ఎవరు ప్రమేయం ఉన్నా అలాంటి వారిని వదిలి పెట్టొద్దని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.