దేవుని మాన్యం భూమి ఆక్రమణలను తొలగించాలి…
1 min readకర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ….
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దిన్నదేవరపాడు గ్రామం సర్వే నంబర్ 23 /2, లో గల సుమారు 37 ఎకరాల శ్రీ చెన్నకేశవ స్వామి,ఆంజనేయ స్వామి ల దేవాలయ మాన్యం భూమి ఇంతకు మునుపే చట్టబద్దంగా కొంత స్వాధీనం చేసుకుని విలేఖరులకు ఇవ్వడం జరిగిందనీ, కానీ వ్యాపార దృక్పథంతో కొందరు సదరు మాన్యం భూమిని ఆక్రమించడం జరుగుతోందని , అజ్ఞాత వ్యక్తి ద్వారా విషయం తెలిసుకున్న విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ వెంఠనే స్పందించి….దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్తో మాట్లాడి, అలాగే రెవెన్యూ శాఖకు చెందిన కర్నూల్ తాసిల్దార్ శ్రీ నాయక్ ని వీఆర్వో శ్రీ రంగయ్య ని, సర్వేయర్ సుధాకర్ ని కలిసి దానికి సంబంధించి సర్వే కొలతలు వేసి వీటన్నిటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు తర్వాత ఎండోమెంట్ ఏసీ తో ఫోన్లో మాట్లాడించి సమన్వయం చేసి సదరు దేవాలయ మాన్యం కాపాడే ప్రయత్నం చేశామని, హిందూ సమాజానికి వచ్చే అన్ని సమస్యలు కోసం విశ్వ హిందూ పరిషత్ పోరాడుతుందని తెలియజేశారు.