పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలంలోని కరిమద్దెల గ్రామంలో రైతు సోదరులందరికీ గురువారం నాడు పంట సాగు హక్కు పత్రము (CCRC) పై మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కౌలు కార్డు పరిమితి, 11 నెలల కాల పరిమితి ఉంటుందని .భూ యజమానికి భూమిపై పూర్తి హక్కు,కౌలుదారునికిపండించినపంటపైహక్కఉంటుందని జతపరచవలసిన పత్రాలు భూ యజమాని యొక్క ఆధార్ కార్డు, మరియు కౌలుదారిని ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ రెండు ఫోటోలు.కౌలు ఖరారు నామా పత్రాన్ని పూర్తి వివరాలతో నింపి భూ యజమాని మరియు కౌలుదారుడు రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించి వారి సమక్షంలో సంతకాలు చేసి సిసిఆర్సి పొందవలసి ఉంటుందని తెలిపారు కౌలు రైతు కార్డు వల్ల వల్ల ఉపయోగాలు ఉంటాయని. కనీస మద్దతు ధరపై పండించిన ధాన్యాన్ని అమ్ముకోచ్చని. పంటల బీమా పొందడానికి. ఇన్పుట్ సబ్సిడీ పొందటానికి. అవకాశం ఉంటుందని. బ్యాంకు నుండి రుణం పొందటానికి జాయింట్ లయాబిలిటీ గ్రూప్ రూపంలో. పొందవచ్చని. రైతు సేవ కేంద్రాల నుండి ఎరువులు మరియు ఇతర కారకాలు పొందటానికి. రైతు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని వివరించారు. రైతులందరూ కౌలు రైతు దరఖాస్తుకు స్థానిక విఆర్ఓ ను సంప్రదించాలని కోరారు.