వాల్మీకి బిడ్డ వాసంతి మృతి పై అనుమానాలను ఛేదించాలి
1 min readవాల్మీకి బోయ సేవా సంస్థ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్ : ముచ్చుమర్రి మైనర్ బాలికపై జరిగిన పైశాచిక చర్యను ఖండిస్తూ వాల్మీకి నాయకులు, ఇదొక మానవత్వానికి జరిగిన “మచ్చగా” అభివర్ణించారు. అభం శుభం తెలియని చిన్నారిని క్రూరంగా హింసించి హతమార్చడం యావత్తు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటనను, తీవ్రంగా ఖండిస్తూ నిందితులను ఎంతటి వారైనా వదలకుండా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులకు త్వరితగతిన కేసును ఛేదించాలని కోరుతూ, భాదిత కుంటుంబానికి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైనది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని, వీలైతే సి.బి.ఐ దర్యాప్తు సంస్థకు కేసును అప్పంగించవలసినదిగా కోరడమైనది.స్థానిక వాల్మీకి బోయసేవాసంస్థ కార్యాలయం లో జరిగిన కార్యక్రమానికి వాల్మీకి బోయ సేవా సంస్థ( VBSS) వ్యవస్థాపక అధ్యక్షులు కుభేర స్వామి , VBSS అధ్యక్షులు తలారి కృష్ణ నాయడు,సంయుక్త కార్యదర్శి రవి శంకర్ నాయుడు, వాల్మీకి ముఖ్య నాయకులు కొల్లాయి పెద్దయ్య, బస్తిపాడు మల్లికార్జున, పందిపాడు శంకర్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.