PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి

1 min read

మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలి

ఏలూరులోని కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ

విద్యార్థినులతో సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్

పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేస్తా

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతోపాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.  స్థానిక కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యా బోధన , మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనా ఉండాలన్నారు.  విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నదని, అందుకు తగిన విధంగా విద్యా ఫలితాలు ఉండాలన్నారు. పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి విద్యార్థినీ, విద్యార్థులలో పౌష్టికాహారలోపం లేకుండా ఉండేలా మధ్యాహ్న భోజనంలో ప్రతీ రోజు పౌష్టికాహారంతో  ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, దీంతో పాటు అంతేకాక చిక్కీలు కూడా అందిస్తున్నది, నిర్దేశించిన మెనూను ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.   తాను తన జిల్లాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తన పరిశీలనలో తేలితే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.  మధ్యాహ్న భోజన కిచెన్ ని పరిశీలించి  వంట సరుకుల నాణ్యత, కోడిగుడ్ల పరిమాణం, చిక్కీ ల నాణ్యత, భోజనం నాణ్యత ను, కిచెన్ లో పరిశుభ్రతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.  పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, వండిన ఆహారం పరిమాణంలను ప్రధానోపాధ్యాయులను  కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  ఆహరం వండే విధానం, మెనూ ప్రకారం పిల్లలకు అందిస్తున్నారా లేదా అని కూడా పరిశీలించాలన్నారు.  విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా తెలియజేయాలని, భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలని తెలియజేస్తూ పరిశీలించాలన్నారు.  అనంతరం తరగతి గదులను పరిశీలించారు. విద్యా కానుక కింద అందించిన బ్యాగ్ లు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందరికీ అందాయా అని విద్యార్థినులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  మధ్యాహ్న భోజనం నాణ్యతను గురించి కూడా విద్యార్థినులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యా శాఖాధికారులు కూడా తరచూ తమపరిధిలోని పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.  భోజన నాణ్యత పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.  కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖాధికారి అబ్రహం, నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, తహసీల్దార్ మురార్జీ, ఎంఈఓ ఆర్. రంగయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుని జి. సునీత, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author