కాగితం సంచులతో పర్యావరణ హితం.. తాజుద్దీన్( ప్రధానోపాధ్యాయులు)
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: కాగితం సంచుల తయారీని, వాడకాన్ని ప్రోత్సహిద్దామని, తద్వారా ప్లాస్టిక్ సంచుల వినియోగానికి చరమగీతం పాడుదామని చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయులు తాజుద్దీన్ అన్నారు.పట్టణంలోని పెద్ద కబేలా వీధిలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శుక్రవారం ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తాజుద్దీన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచుల స్థానంలో పేపరు సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు అవకాశం కలుగుతుందని అన్నారు. జిల్లాలో కాగితపు సంచుల తయారీని ప్రోత్సహించేలా ప్రభుత్వం కాగితపు సంచుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించాలని చైతన్య స్కూల్ పాఠశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలగబోయే నష్టాలను వివరిస్తూ నినాదాలు చేశారు. తమ విద్యాసంస్థ విద్యార్థులు సామాజిక స్పఅహతో చేస్తున్న కార్యక్రమం అని తెలియజేశారు.