సనాతనం ఆత్మ విజ్ఞాన మార్గం
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
అల్లూరు గ్రామంలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారతీయ సనాతన ధర్మం ఆత్మ విజ్ఞాన మార్గమని, తానెవరో తెలుసుకుని, మృత్యు భయాన్ని తొలగించి, దేహాభిమానాన్ని తొలగించి, నేను దేహము కాదు శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపమని తెలిపేదే భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారాంశమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నందికొట్కూరు మండలం, అల్లూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ధార్మిక సభా కార్యక్రమంలో వారు ప్రవచించారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై వీరం నాగేశ్వర రెడ్డి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె.సి.నాగలక్ష్మయ్య, అర్చకులు డి.చంద్రశేఖర్, జి.జయరామి రెడ్డి, యం. రత్నాకర్ రెడ్డి, జి.లక్ష్మీదేవమ్మ, వి.లక్ష్మన్న, కె.పి.నాగలక్ష్మయ్య, జి విష్ణు నాయుడు, జి.చిన్నపుల్లన్న, జి. వెంకటేశ్వర్లు, బి.వెంకటరమణ, జి. మద్దిలేటి, యం. లక్ష్మీరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.