జిపిఎస్ గెజిట్ వెంటనే రద్దు చేయాలి
1 min readఆపస్ రాష్ట్ర అధ్యక్షులు యస్ బాలాజీ
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: దశాబ్ద కాలం పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ఓపిఎస్ పునరుద్ధరించాలని పలుమార్లు పోరాటాలు చేస్తున్నా పెడచెవిన పెట్టిన గత రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ పేరిట జిపిఎస్ అమలుకు చట్టం చేయడం శోచనీయమని, గత ప్రభుత్వం చేసిన ఉద్యోగ వ్యతిరేఖ చర్య అయిన జీపీయస్ ను రద్దు చేయకుండా జిపిఎస్ తేది: 20 అక్టోబర్ 2023 నుండి అమలవుతున్నదని రాజపత్రం విడుదల చేయడం అమానుషం అని, పాత పెన్షన్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టకుండా గత ప్రభుత్వ ధోరణి కొనసాగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్)రాష్ట్ర అధ్యక్షులు శవన్నగారి బాలాజీ ,ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకట సత్యనారాయణ తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ ప్రకటనలో తెలియజేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో సిపియస్ కు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ ఉపాధ్యాయులతో ఎటువంటి సమావేశం నిర్వహించకుండా అభిప్రాయాలు తీసుకోకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం అన్యాయం అన్నారు. ఇకనైనా ప్రభుత్వం సీపీయస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
.