గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలపై సీఎంకి కృతజ్ఞతలు
1 min readపల్లెవెలుగు వెబ్ అమరావతి: గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపిన …. బిర్రు ప్రతాప్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి….అధ్యక్షులు వై.వి. బి రాజేంద్రప్రసాద్ మరియు రాష్ట్ర కమిటి ప్రతినిధులతో కలిసి ఈ రోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గతంలో హామీ ఇచ్చిన విధంగా గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు రాష్ట్రంలోని 12918 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మరియు మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల అందరి తరపున మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచ్ల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించడం జరిగింది.గత ఐదు సంవత్సరాలుగా వివిధ పద్దుల కింద గత జగన్ ప్రభుత్వం దొంగిలించి , దారి మళ్లించిన వేల కోట్ల నిధులను కూడా ఇప్పించ వలసినదిగా ముఖ్య మంత్రి కి విజ్ఞప్తి చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ తో పాటు పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులు కొత్తపు ముని రెడ్డి, సింగం శెట్టి సుబ్బ రామయ్య,చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ చాంబర్ అద్యక్షుడు చుక్కా ధనుంజయ యాదవ్ , పంచాయతీరాజ్ ఛాంబర్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ డేగల కృష్ణమూర్తితదితరులు పాల్గొన్నారు.