PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8ఏండ్ల బాలిక పైన జరిగిన అత్యాచారం, హత్యను ఖండించండి

1 min read

– బాలిక కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం  ఇచ్చి ఆదుకోవాలి:-వాల్మికి సంఘం,ఆత్మకూరు

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ముచ్చు మర్రి గ్రామంలో 8 ఏండ్ల వాల్మీకి చిన్నారి పై జరిగిన అత్యాచారం, హత్యను ఆత్మకూరు వాల్మికి సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఆత్మకూరు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ, రాస్తారోకో నిర్వహించబడింది. ఆత్మకూరు లో ర్యాలీ అనంతరంKG రోడ్డు లోని గౌడ్ సెంటర్ లో రాస్తారోకో  అనంతరం వాల్మికి సంఘ నాయకులు మాట్లాడుతూ  గత 8 రోజుల క్రితం నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమర్రి గ్రామం లో 8 ఎండ్ల చినారి పై జరిగినటువంటి అత్యాచారం సభ్యసమాజం తల దించుకునేలా చేసేంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో జరిగిన అనేక సంఘటనలతో పొలిస్తే చిన్నారి మరియు అత్యాచారం చేసినటువంటి బాలురు కూడ మైనర్లు కావటం సమాజం అశ్యర్యం పోయేలా చేసింది అని పేర్కొన్నారు. అలాగే అత్యంత వెనుక బడిన సామాజిక వర్గం అయినట్టు వంటి వాల్మీకి బోయ కులానికి చెందిన వాల్మీకి వాసంతి పై జరిగినా ఈ అత్యాచారాన్ని రెండు తెలుగు రాష్ట్రము లో ప్రతి ఒక్కరూ ఖండించాలిసిన అవసరం వుంది అని ఈ చర్య పట్ల కేవలం ఒక కులం ఒక మతం అనీ కాకుండా ప్రతి సామాజిక వర్గం స్పందించి దోషూల  పట్ల కఠినమైన చర్యలు తీసుకొని వారి కుటుంబానికి తగిన న్యాయం జరిగే విధంగా చూడాలి అని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అన్నారు.  ఈ కార్యక్రమంలోఆదిత్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ విజయ భాస్కర్ నాయుడు మరియు  ఆత్మకూరు వాల్మికి సంఘ నాయకులు శ్రీ దీప మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ B. వెంకటరమణ ,పాల శివ,మండ్ల మల్లికార్జున,మీనిగ రామకృష్ణ(M. లింగాపురం), శివప్రసాద్ ,చెలిమిళ్ల పరమేశ్వరుడు, చెలిమిళ్ల గోపాల్, ఇందిరేశ్వరం తిమ్మయ్య,మరియు వాల్మికి ఉద్యోగ సంఘ నాయకులు జనార్దన్, మల్లికార్జున, శ్రీనివాసులు, శ్రీహరి,రాఘవేంద్ర, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author