PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి

1 min read

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అర్జీలను స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం. ముక్కంటి తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్జీలకు అధికారులు క్షేత్రస్ధాయిలో క్షుణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు.  అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఒకసారి అందిన అర్జీ తిరిగి రెండవసారి రానివిధంగా పరిష్కారక్రియ ఉండాలన్నారు.  ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల పరంగా పరిష్కారం కోసం పంపిన వాటిపై చర్యలు తీసుకొని యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలన్నారు. సర్వే, తదితర అంశాలపై ఫిర్యాదు అందిన మరుసటిరోజే సంబంధిత విఆర్ఓ, తదితరులతో విచారణచేసి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిసోమవారం అందే అర్జీలపై సత్వర పరిష్కార చర్యలు తీసుకుంటూ ఆవారంలో శుక్రవారం నాటికి సమగ్ర నివేదిక తమకు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.  డొమిస్టిక్ వైలెన్స్ కు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని పోలీస్ అధికారులు వాటిపై తగు విచారణ చేసి కౌన్సిలింగ్ నిర్వహించి సంబంధిత యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. 

సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలిఅన్నారు.

వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  ఏలూరు పత్తేబాద్ కు చెందిన కె. వెంకట సత్యనారాయణ అర్జినీస్తూ డబ్బులు కోసం తమపై కుమారుడు క్రిమినల్ కేసులు పెడుతూ హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారు.  తమకు వారి నుండి రక్షణ కల్పించి భృతి ఇప్పించాలని కోరారు.  దీనిపై  కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత విషయంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏలూరు ఆర్డివోను కలెక్టర్ ఆదేశించారు. పెదవేగి మండలం నడిపల్లికి చెందిన కొల్లి మణికుమార్ అర్జీని ఇస్తూ మానసికంగా కృంగి ఫిట్స్, కళ్లు తిరుగుతూ నడవలేని, మాట్లాడలేని పరిస్ధితిలో ఉన్న తమ కుమారుడు పూర్తిగా వీల్ చైర్ పైనే జీవించవలసివస్తుందని అతని ఆధారానికి ప్రభుత్వం కల్పిస్తున్న రూ. 15 వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.  ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగు పరిశీలన చేసి సంబందిత నివేదికను డిఆర్ డిఎ పిడికి అందజేయాలని ఆదేశించారు.  టి. నర్సాపురం మండలం బంధం చర్లకు చెందిన అనుమోలు ప్రభాకరరావు అర్జీనిస్తూ తమ భూమి అమ్ముకొని టి. నర్సాపురం ప్రైమరీ అగ్రకల్చరల్ కొపరేటివ్ సొసైటీనందు రూ. 18 లక్షలు టర్మ్ టిపాజిట్ చేశామని అయితే కాల పరిమితి పూర్తయినా నగదు ఇవ్వడం లేదని తెలిపారు.  దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని నూజివీడు డివిజనల్ కోఆపరేటివ్ అధికారిని అదేశించారు.  పోలవరం మండలం ఎల్ఎన్ డి పేటకు చెందిన సిహెచ్ వీర్రాజు అర్జీ ఇస్తూ తమ ఇల్లు అగ్నిప్రమాదానికి గురైయిందని ఇల్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author