వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
1 min readసుంకేశ్వరి గ్రామ ప్రజలు, చిన్నారుల అస్వస్థతకు గురైన తెలుసుకొని అధికారులపై మండిపాటు
మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి
రోగులకు కోసిగి, కల్లూదేవకుంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని డాక్టర్ల కు ఆదేశాలు
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని సుంకేశ్వరి గ్రామం లో దాదాపు 40 మంది అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి సందర్శించి అస్వస్థతకు గురైన రోగుల గురించి కారణాలను వైద్య ఆర్డబ్ల్యుఎస్ అధికారులను, సచివాలయ సిబ్బందిని, గ్రామ ప్రజలను పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అతిసారా వలన వచ్చిన సమస్య అని తెలిసి అధికారులను హెచ్చరించి సుంకేశ్వరి గ్రామం మొత్తం దగ్గరుండి బ్లీచింగ్ పౌడర్ అధికారుల సమక్షంలో చల్లించి, ఇటువంటి సమస్యలు మరల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అస్వస్థతకు గురైన వారిని కోసిగి, కల్లుదేవకుంట ప్రభుత్వ సంబంధించిన డాక్టర్లతో మాట్లాడి అనారోగ్యూలకు ప్రత్యేక చికిత్స అందించాలని ఆదేశించారు. అనంతరం వాంతులు విరేచనాలతో మృతి చెందిన జ్యోతి (4)ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించి మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డియంహచ్ఓ బాలమురళి, డాక్టర్ సురేష్, గోవిందమ్మ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ వేదస్వరూప, తహసీల్దార్ శ్రీ ధర్ మూర్తి, వీఆర్వో ఆనంద్, సుంకేశ్వరి గ్రామ టిడిపి నాయకులు రోగప్ప,రామలింగప్ప, నరసింహులు,లక్ష్మన్న ,అయ్యన్న రంగన్న,అయ్యప్ప,నరసింహులు, రామాంజి, కె.బీరప్ప,బీరప్ప,లక్ష్మీరెడ్డి,రామ లింగ, మాలపల్లి లక్ష్మన్న, రామకృష్ణ, మరియు కార్యకర్తలు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.