మధ్యాహ్న భోజనంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తా..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని జూనియర్ కళాశాల పక్కనున్న గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్న భోజన పథకాన్ని మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగాభోజనం తయారీ కట్టెలపై చేయడం ద్వారా తరగతి గదుల్లోకి పొగ వెళ్ళడంతో విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్ని సార్లు వంట నిర్వాహకులకు చెప్పినా వారు పద్దతి మార్చుకోవడం లేదని పాఠశాల యాజమాన్యంపై సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు.భోజనం నాణ్యత లోపించిందని అధిక శాతం నీళ్ళతో కూడిన ఎగ్ కర్రీని విద్యార్థులకు వడ్డిస్తున్నారని వంట నిర్వాహకులను ఆయన ప్రశ్నించారు.వంటశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం అపరిశుభ్రంగా ఉండడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. ఈ విషయంపై నంద్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని మున్సిపాలిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి తో అన్నారు.భోజనం మరియు పాఠశాల ప్రాంతంలో అపరిశుభ్రంగా ఉండటం పట్ల చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.దీనిపై కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డు ఇంచార్జ్ వి.ఆర్.శ్రీను,టిడిపి నాయకులు ఉస్మాన్ బేగ్, లాలు ప్రసాద్ పాల్గొన్నారు.