మతసామరస్యానికి ప్రతీక మొహర్రం పండుగ..
1 min readపీర్లకు ప్రత్యేక ఫాతేహాలు సమర్పించిన.. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి..
పల్లెవెలుగు న్యూస్ గడివేముల: గడివేముల మండలంలోని పెసర వాయి గ్రామంలో మంగళవారం నాడు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మొహరం సందర్భంగా అలీ అక్బర్ పీర్లను ప్రత్యేక ఫాతేహాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతికగా మొహరం పండుగ ఏటా ప్రజలందరూ కలిసి చేసుకుంటారని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈసారి వర్షాలు బాగా పడ్డాయని రైతులందరూ పాడిపంటలతో సుఖంగా ఉండాలని . పాలన మారింది రాష్ట్ర ప్రజల పరిస్థితి మారిందని. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నారని తెలిపారు. పెంచిన పింఛన్ల తో అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వు కనిపిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే హామీ ఇచ్చిన ప్రకారం మండల ప్రజలకు అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు దేశం సత్యనారాయణరెడ్డి, వంగాల మురళీమోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎస్ ఎ రఫీక్, గని హర్షవర్ధన్, కృష్ణ యాదవ్, శ్రీనివాస యాదవ్, రామచంద్రారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రాచ మల్లు శ్రీనివాసులు, కంది శ్రీనివాసులు, యుగంధర్ రెడ్డి, రాజు, రమణారెడ్డి, ఒడ్డు లక్ష్మీదేవి, ఒడ్డు ప్రశాంతి, సుభద్రమ్మ, తూము బాలేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, సర్పంచ్ మాలిక్ భాషా టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.