కౌలు చేసే ప్రతి రైతుకు. .కౌలు కార్డు తప్పనిసరి : జిల్లా వ్యవసాయ అధికారి
1 min readపల్లెవెలుగు న్యూస్ గడివేముల: మండలానికి1027 కౌలు కార్డులు మంజూరు అయినట్టు పంట కౌలు చేసే ప్రతి రైతు విధిగా కౌలు కార్డును వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది సమక్షంలో రైతు సేవ కేంద్రం నందు సరియైన పత్రాలు చూపించి భూ యజమాని మరియు కౌలు దారుడు సంతకం చేసి కౌలు కార్డు తీసుకోవాలి. భూ యజమానికి భూమిపై పూర్తి హక్కు మరియు కౌలుదారునికి పండించిన పంటపై హక్కు ఉంటుందని, కౌలు కాలం 11 నెలలు మాత్రమే ఉంటుంది నంద్యాల వ్యవసాయ అధికారి మురళి కృష్ణ తెలిపారు.కౌలు కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు .కనీస మద్దతు ధరపై పంటను అమ్ముకోవటానికి, పంటల బీమా వర్తించటానికి, పంట నష్టపరిహారం పొందటానికి, బ్యాంకు నుంచి కౌలు రైతు రుణం పొందటానికి, రైతు సేవా కేంద్రం నుంచి ఎరువులు మరియు ఇతర కారకాలు కొనుగోలు చేయడానికి అనేక ఉపయోగాలు ఉంటాయని తెలిపారు.చిందుకూరులో వేసిన 30 రోజుల సోయాబీన్ పంటను గమనించి 50 కేజీల యూరియా మరియు 10 కేజీల పొటాషను కలిపి పై పాటుగా చల్లుకోవాలని, అదేవిధంగా అక్కడక్కడ బీటిల్స్ గమనించి. వీటి నివారణకు ఐదు మిల్లీ లీటర్లు వేప నూనె ఒక లీటరు నీటికి కలుపుకొని 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని వీటివల్ల పిల్ల పురుగులు నశిస్తాయి మరియు గుడ్డు పొదగకుండా ఉంటుంది. ఇతర వ్యవసాయ పథకాలైన పీఎం కిసాన్, మట్టి నమూనా సేకరణ మరియు వాటి ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం, రైతు సేవ కేంద్రం లో ఎరువుల లభ్యత పై రైతులతో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.