PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీఐజీ కన్నెర్ర..సీఐ ఎస్ఐ సస్పెండ్

1 min read

-ముచ్చుమర్రి వాసంతి ఎఫెక్ట్..-11 రోజులైనా ఇంకా దొరకని మృతదేహం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కర్నూలు రేంజ్ డీఐజీ కి కోపం తెప్పించారు ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు.ఈ పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించడంతో డీఐజీ కన్నెర్ర జేశారు.సీఐ ఎస్ఐ లను సస్పెండ్ చేస్తూ డిఐజి కొరడా ఘు లిపించారు.వివరాల్లోకి వెళ్లితే   నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి గ్రామంలో ఈనెల 7 వ తేదీన వాసంతి అనే బాలిక అదృశ్యం కావడం అమ్మాయిపై అఘాయిత్యం చేసి చంపి ము చ్చుమర్రి కాల్వలో పడేసిన సంఘటన తెలిసిందే.కూతురు కనిపించడం లేదని అదే రోజున తల్లిదండ్రులు మద్దిలేటి, సుజాతమ్మ ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.11 రోజులు అయినా కూడా బాలిక మృతదేహం దొరక్క పోవడం విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించినందుకు గాను నందికొట్కూరు రూరల్ సీఐ ఓ.విజయభాస్కర్ మరియు ముచ్చుమర్రి ఎస్ఐ ఆర్ జయశేఖర్ లను సస్పెండ్ చేస్తూ విధుల నుండి తప్పిస్తున్నట్లు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు స్టేషన్ లో సీఆర్ నెంబర్ 69/2024 అమ్మాయి అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కానీ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే ఎస్సై సీఐ లు చర్యలు తీసుకుని ఉంటే అమ్మాయి మృతదేహం అప్పుడే దొరికేది కదా..వీళ్లు నిర్లక్ష్యం చేసినందుకే మృతదేహం ఇంకా దొరకలేదని డిఐజి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిఐజి చర్యలు తెలుసుకోవడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది.

About Author