PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయ సాయిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ జర్నలిస్టులు..

1 min read

-పట్టణంలో ధర్నా అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ లో జర్నలిస్టులు ఫిర్యాదు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వైసీపీ నేత రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి మంగళవారం పాత్రికేయులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా బుధవారం ధర్నా చేశారు.పట్టణంలోని కేజీ రహదారి వెంట పటేల్ బొమ్మ పోలీస్ స్టేషన్ వరకు ప్రజా సంఘాల నాయకులతో కలసి పాత్రికేయులు ధర్నా చేపట్టారు.అన్ని పార్టీలకు సంబంధించినవి ప్రజలకు తెలిసే విధంగా వార్తలు రాస్తాము.విజయ సాయి రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో విషయాలను ప్రజలకు చేరవేయలేదా పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని విజయ సాయి రెడ్డి వెంటనే అరెస్టు చేయాలని సీనియర్ పాత్రికేయులు భూపాల్ అన్నారు.నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తే ఊరుకునేది లేదని మీడియా ప్రతినిధులు మండిపడ్డారు.పటేల్ సెంటర్లో మీడియా ప్రతినిధులు విజయసాయి రెడ్డి పై చర్యలు చేసుకోవాలని ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే పత్రిక, మీడియా ప్రతినిధులను భయ భ్రాంతులకు గురి చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విజయసాయి రెడ్డి పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు,జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, తాలూకా అధ్యక్షులు నాగేష్, జిల్లా ఉపాధ్యక్షులు సురేష్, ప్రేమ్ కుమార్,ప్రదీప్,పరమేష్, సుబ్బన్న,విజయ్, నాగరాజు,జయరాజ్,ఉమర్, ఖలీల్,ప్రజా సంఘాల నాయకులు రఘురాం మూర్తి, ఫక్కిర్ సాహెబ్,కాటేపోగు నాగ సురేష్ పాల్గొన్నారు.

About Author