జర్నలిస్టులకు విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలి
1 min readమంత్రాలయం ఏపియుడబ్యూజే డిమాండ్
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : జర్నలిస్టుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రాలయం నియోజకవర్గం ఏపియుడబ్యూజే తాలుకా అధ్యక్షులు జయరాజు, కార్యదర్శి హుశేని, ఆర్గనైజింగ్ కార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి షాబువలి లు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మంత్రాలయం లో ఏపియుడబ్యూజే ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్ లో నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం మహత్మ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రతినిధుల పై వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అవమాన అహంకార మాటలను ఉపసంహరించుకుని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసిపి పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి,దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పై వస్తున్న వ్యవహారం గురుంచి విజయసాయి రెడ్డి ని ప్రశ్నించిన మీడియా ప్రతినిధుల ను ఏరా పోరా అంటూ మీ పిల్లలు మీకే పుట్టారా అంటూ అవమానించడం దారుణం అన్నారు. రాజ్యసభ సభ్యులు గా బాధ్యత పదవి లో ఉంటూ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన తీరు సభ్యసమాజం సహించదన్నారు. వెంటనే రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది మూర్ము విజయ్ సాయి రెడ్డిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో సారి జర్నలిస్టుల పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపియుడబ్యూజే ఉప అధ్యక్షులు రాఘవేంద్ర గౌడ, నరసప్ప, మండల గౌరవ అధ్యక్షులు రానోజీ, మండల అధ్యక్షులు భీమరాయ, కార్యదర్శి వడ్డే వెంకట్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రామస్వామి, కోశాధికారి రఫీ, కంతం నర్సింహులు, లక్ష్మయ్య, రవి, గాబ్రియేల్, కప్పన్న, రామాంజి తదితరులు ఉన్నారు.