జూలై 20న లక్షకుంకుమార్చన
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ఆషాడ పౌర్ణమి ఘడియలు రావడంతో 20 తేదీరోజున శ్రీఅమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపించబడుతోంది. లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా దేవస్థానంకల్పించబడింది. లక్షకుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పం పఠించబడుతుంది. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను నిర్వహించడం జరుగుతుంది. అనంతరం లక్షకుంకుమార్చన జరిపించబడుతుంది.లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని పురాణాల్లోచెప్పబడుతోంది. శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలను పరోక్షంగా జరిపించుకునేందుకువీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవను నిర్వహిస్తోంది.ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.www.srisalladevasthanam.org ê aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.