త్యాగానికి మతసామరస్యానికి ప్రతీక భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: త్యాగానికి ప్రతీక అయిన మొహర్రం వేడుకలను గడివేముల మండలంలోని పెసర వాయి, కరిమద్దెల, గడివేముల గ్రామాల్లో బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గడివేములలో మంగళవారం రాత్రి నుండి వేకువ జామున పీర్ల చావిడీల్లో పీర్లను దర్శించుకొని భక్తులు దట్టీలు సమర్పించారు. అనంతరం పీర్లను వీధుల గుండా ఊరేగించి ఉదయం పీర్లచావిడిలో కూర్చోబెట్టారు. చావిడీల్లో పీర్లను దర్శించుకొని దట్టీలు సమర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన పీర్లకు ఆయా గ్రామాల్లో భక్తులు పూలు, దట్టీలు సమర్పించారు.పీర్లను ఊరేగించారు. ఈ ఊరేగింపులో కుల, మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు.సాయంత్రం పీర్లను పురువీధుల గుండా ఊరేగించి నిమజ్జనం చేశారు. పిల్లలు, పెద్దలు కోలాటాలు, ఆటపాటలతో డప్పుచప్పుళ్ల మధ్య పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు.పీర్లను గ్రామాల్లోని వీధుల గుండా ఊరేగించి నిమజ్జనంకు సమీప మద్దిలేరు వాగుకు తరలించారు. పీర్ల ఊరేగింపు ముందు యువకులు, మహిళలు ఆటా, పాటలతో అలరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.