జీ సినిమాలలో ఈ శనివారం వీకెండ్ వినోదం.. డీడీ రిటర్న్స్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ గల రెండు ఛానళ్లు జీ తెలుగు, జీ సినిమాలు తమ ప్రేక్షకులను అలరించడానికి మరోసారి సిద్ధమయ్యాయి. వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఎనలేని వినోదం పంచుతున్న ఈ ఛానల్స్ మరోసారి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఈ వారాంతంలో అలరించేందుకు సిద్దమయ్యాయి. జులై 20 శనివారం సాయంత్రం 6 గంటలకు జీ సినిమాలులో డీడీ రిటర్న్స్ (భూతాల బంగ్లా), జులై 21 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో గామి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానున్నాయి!హారర్ కామెడీ సినిమాగా ప్రేక్షకులను అలరించిన డీడీ రిటర్న్స్(భూతాల బంగ్లా) సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది జీ సినిమాలు. ఈ సినిమా కథ దశాబ్దాల క్రితం పాండిచ్చేరి శివార్లలోని ఒక రాజభవనంలో ప్రారంభమవుతుంది. అక్కడ ఆటలో ఓడిపోయిన వారు కుటుంబ సభ్యులచే చంపబడతారు. ప్రస్తుతం ఒక డాన్ కు చెందిన పెద్ద బ్యాగ్ నిండా డబ్బు, నగలు మరో ముఠా దోచుకుంటుంది. పొరపాటున ఆ బ్యాగ్ సతీష్ (సంతానం) మరియు అతని స్నేహితుల దగ్గరకు వస్తుంది. డబ్బు కోసం జరిగే పోరాటంలో హీరో గెలుస్తాడా, ఓడిపోతాడా అనేదే కథ. సంతానం, సురభి, రెడిన్ కింగ్స్లే, మారన్, టైగర్ తంగదురై, ఫెఫ్సీ విజయన్, ధీనా, దీప వంటి నటులు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ సినిమాను జీ సినిమాలు వేదికగా మీరూ చూసేయండి!ఇక, వారాంతం వినోదంలో భాగంగా గామి సినిమా ఆదివారం ప్రసారం అవుతుంది. ‘గామి’ కథ మానవ స్పర్శ కారణంగా మూర్ఛపోయే అరుదైన సమస్యతో బాధపడుతున్న శంకర్ (విశ్వక్సేన్) అనే అఘోరా చుట్టూ తిరుగుతుంది. ద్రోణగిరి పర్వతంపై దొరికే అరుదైన మాలి పత్రాల అన్వేషణకు బయల్దేరిన శంకర్‌కి, దేవదాసి దుర్గ(అభినయ), ఆమె కూతురు(హారిక), జాహ్నవి(చాందినీ చౌదరి)కి గల సంబంధం ఏంటనేది తెలియాలంటే జీ తెలుగులో ప్రసారం కానున్న గామి సినిమా చూడాల్సిందే. విద్యాధర్ కగితా దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్, సస్పెన్స్ మేళవింపుతో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అత్యున్నత స్థాయి సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. విశ్వక్సేన్, చాందినీ చౌదరి, అభినయ, మహ్మద్ సమద్, హారిక పేడాడ, శాంతిరావు, మయాంక్ పరాక్ నటన మరిచిపోలేని అనుభూతినిస్తుంది. కామెడీతోపాటు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఫీల్‌ని పొందాలంటే ఈ వారాంతంలో జీ సినిమాలు, జీ తెలుగులో ప్రసారం కానున్న డీడీ రిటర్న్స్, గామి సినిమాలను మిస్ అవకండి.