4వ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం
1 min readఈనెల 18 నుండి 28వ తేదీ వరకు జరిగే సభ్యత్వ నమోదు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు
పల్లెవెలుగు వెబ్ ఉమ్మడి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు గురువారం స్థానిక బిర్లా కాంపౌండ్ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగం తో కోరుకున్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో భాగమయేందుకు ప్రతి ఒక్క జనసైనికుడు ముందుకు రావాలన్నారు. 4వ విడత క్రియాశీలక సభ్యత్వం ఈనెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనుందని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు సభ్యత్వ నమోదు చేసుకొని బీమా సదుపాయం పొందాలని క్రియాశీలక సభ్యత్వం పొందిన వారికి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా వర్తిస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి 50 మంది వాలంటర్లను నియమించామని సభ్యత్వం పొందాలనుకున్న జనసైనికుడు వారిని సంప్రదించాలని అన్నారు. అనంతరం జనసేన వాలంటీర్ల ఫోన్లో వారి చేతుల మీదుగా క్రియా మెంబర్షిప్ అప్లికేషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు PBV సుబ్బయ్య, మంజునాథ్, బజారి, సుధాకర్, సుమలత, సతీష్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.