ఉన్నత పాఠశాల విద్యార్థులకు బైజుస్ టాబ్ల పంపిణీ ఆపండి – ఆప్టా
1 min readపల్లెవెలుగు వెబ్ అమరావతి: గత ప్రభుత్వం 2022లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు బైజుస్ టాబ్ లను పంపిణీ చేసింది, వాటిని విద్యార్థులు వాడుకుని విద్యాపరిజ్ఞానాన్ని పొందుతారని ఎల్లరము ఆశించాము. కానీ విద్యార్థులు ఆ ట్యాబ్ లను విద్యా విషయాలకు కాకుండా అన్య కార్యకలాపాలకు వాడుకుంటూ చెడు మార్గం పడుతున్నారు. అంతేకాక రాత్రి సమయంలో ఇంటి వద్ద నిద్రపోకుండా ట్యాబ్ లలో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు దానివలన వారి మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని మరియు తాము తమ పిల్లలను నిరోధించలేకపోతున్నామని వారి తల్లిదండ్రులే ఉపాధ్యాయులకు చాలాసార్లు ఫిర్యాదు చేసి ఉన్నారు. మీరు ఈ విషయంలో కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించి నిర్ణయం తీసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాల ల యందు ఉపాద్యాయ సిబ్బంది ఈ విషయం లో విద్యార్థుల ను అదుపు లో పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది.గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ప్రతి తరగతికి ఇంటరేక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ సరఫరా చేసి ఉన్నందున విద్యార్థులకు బైజుస్ కంటెంట్ కలిగిన విద్యా సమాచారాన్ని పాఠశాలలోనే అందిస్తూ ఉన్నందున భైజస్ టాబ్ లు విద్యార్దులకు అవసరము లేదు.తమ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమ దృష్ట్యా, విద్యార్థులు చెడు మార్గము పట్టి నైతిక విలువలు తగ్గి పోకుండా ఉండేందుకుగాను ఈ సంవత్సరం నుండి బై జ్యూస్ ట్యాబ్ ల సరఫరా నిలిపివేయాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె ప్రకాష్ రావు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు కి ఒక లేఖ ద్వారా వినతి పత్రం అందించారు.