కర్నూలు రేంజ్ నూతన డిఐజిగా బాధ్యతలు
1 min readకర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్
శాంతిభద్రతల పరిరక్షణ లో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తాం.
ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలలో నిఘా ఉంచుతాం.
ప్రజలకు ఏల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.
బాధ్యతలు స్వీకరించిన నూతన డిఐజి ని మర్యాదపూర్వకంగా కలిసిన… ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం ఉదయం కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎఆర్ పోలీసు సిబ్బందిచే డిఐజివందనం స్వీకరించారు. పురోహితులు డిఐజి స్సులు అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… కర్నూలు రేంజ్ డిఐజి గా రాయలసీమ కు రావడం ఇదే మొదటిసారి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిర్వహణకు కర్నూలు రేంజ్ పరిధిలోని 4 (కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య) జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఒక టీమ్ వర్క్ గా పని చేస్తాము. ప్రశాంత వాతావరణం కు అన్ని రకాల చర్యలు తీసుకుంటాము.ప్రజలకు ఏల్లప్పుడూ అందుబాటులో ఉంటాము. శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గురించి.2009 ఐపియస్ బ్యాచ్ కు చెందిన వారు.చదువు : ఎం.బి.బిఎస్ , కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ 2004 లో పూర్తి చేశారు. 2009 లో సివిల్స్ రాసి ఐపియస్ కు ఎంపికయ్యారు.స్వగ్రామం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా. పోలవరంఅసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్, ఖాజీ పేట , పార్వతీపురం, వరంగల్ , విజయనగరం ఓఎస్డీగా , చేశారు.ఎస్పీ గా… విశాఖపట్నం రూరల్, డిసిపి లా అండ్ ఆర్డర్ విజయవాడ సిటి, సీ పోర్టు డైరెక్టర్ కాకినాడ, ప్రకాశం జిల్లా, , గుంతకల్ రైల్వే , పోలీసు ట్రాన్స్ పోర్టు ఆర్గనైజేషన్ , 16 బెటాలియన్ కమాండెంట్ విశాఖ పట్నం , ఆక్టోపస్ , పోలీసు ట్రాన్స్ ఆర్గనైజేషన్ లలో ఎస్పీగా పని చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర సాధారణ ఐపియస్ ల బదీలలో భాగంగా గ్రేహౌండ్స్ లో డిఐజి గా పని చేస్తూ బదిలీ పై కర్నూలు రేంజ్ డిఐజి గా శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు ఈ రోజు రావడం జరిగింది.
కర్నూలు రేంజ్ డిఐజి ని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో…
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ , నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా , కడప జిల్లా ఎస్పీ వి. హర్ష వర్ధన్ రాజు , అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ విద్యా సాగర్ నాయుడు , సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ , అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు ఉన్నారు.