విద్యార్థులు దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలి
1 min readభాష్యం పాఠశాల ప్రెషర్స్ డే వేడుకల్లో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థులు కేవలం మార్కులు ర్యాంకులకే పరిమితం కాకుండా దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని భాష్యం పాఠశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను మార్కులు, ర్యాంకులకే పరిమితం చేసి చూస్తున్నారని, అలా కాకుండా వారిని మంచి పౌరులుగా ఎదిగేలా ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దకుండా తమ పిల్లల్లో ఉన్న అభిరుచులకు అనుగుణంగా చదివించాలని కోరారు. విద్యార్థులు చిన్నతనం నుండే కష్టపడే మన తత్వాన్ని అలవాటు చేసుకోవాలని తద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సెల్ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, ప్రస్తుతం సెల్ ఫోన్ ప్రమాదకర ఆయుధంగా తయారైందని ఆయన తెలిపారు. సెల్ఫోన్ కేవలం తమకు ఉపయోగపడే అంశాలకు మాత్రమే వినియోగించాలని, అనవసర విషయాలకు వినియోగించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతి విద్యార్థి సమయపాలన పాటించాలని సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. గడిచిన సమయం తిరిగి రాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పారు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల్లో నిర్మితమవుతుందని ఇందుకు కారణం భావి భారత పౌరులైన విద్యార్థులే అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా యువత మనదేశంలో ఉన్నారని మన దేశ భవిష్యత్తు యువత భు జస్కంగాలపైనే ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ,యువత, డాక్టర్లు ఇంజనీర్లు ఇలా ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుని దేశ ఉజ్వల భవిష్యత్తులో భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల వంటి ఇతర రంగాలలో కూడా రాణించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని చెప్పారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మనిషి సగటు జీవితకాలం పెరుగుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను చదువుతోపాటు వారి ఉన్నతికి దోహదం చేసే ఇతర అంశాలలో కూడా సాధన చేసేలా కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి తమకు తామే.. ప్రత్యేకమైన వ్యక్తులుగా భావించాలని ఇతరులతో పోల్చుకొని నిరాశకు గురి కావలసిన అవసరం లేదని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇతరులతో పోల్చకుండా తమ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి విద్యార్థి తమ జీవితంలో మంచి స్నేహితులను ఎన్నుకోవాలని అప్పుడే వారు జీవితంలో రాణిస్తారని వివరించారు. విద్యార్థులు చదువులో వత్తిళ్లు అధిగమించేందుకు వీలుగా మెడిటేషన్ చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు మంచి ఆహారపు అలవాట్లను పాటించాలని చెప్పారు. ముఖ్యంగా బయట ఆహార పదార్థాలను తినడం కలుషితమైన నీటిని తాగడం వంటి అంశాలకు దూరంగా ఉండాలని వీటి వల్ల అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతాయని చెప్పారు. ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని వివరించారు. ప్రతి విద్యార్థి తమ మనసును నియంత్రణలో ఉంచుకొని మంచి పౌరులుగా ఎదగాలన్నారు. ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉండి జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన వారు పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే అంశాలను వింటే ఎంతో నేర్చుకోవచ్చని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివి జీవితంలో సమలు సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.