రోడ్డు ప్రమాదాల రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరి
1 min read– సీఐ, నారాయణ యాదవ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: రోడ్డు ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ నారాయణ యాదవ్ తెలిపారు, అడిషనల్సీనియర్ సివిల్ జడ్జి, లోకదాలత్ ఇన్చార్జి సెక్రటరీ ప్రత్యూష ఆదేశాల మేరకు లీగల్ సర్వీస్ కమిటీ, అలాగే సీఐ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి, చెన్నూరు పాత రోడ్డు నుండి, కొత్త రోడ్డు వరకు ద్విచక్ర వాహనదారులకు, మండల ప్రజలకు రోడ్డు ప్రమాదాల గురించి, అదే విధంగా హెల్మెట్ గురించి విద్యార్థులతో స్థానిక ప్రజలతో కలసి ఆయన అవగాహన ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్భంగా సీఐ నారాయణ యాదవ్ మాట్లాడుతూ, ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం తలకు బలమైన గాయాలు తగలడంతోనే మరణాలు సంభవిస్తున్నాయని ఆయన ప్రజలకు తెలియజేశారు, “హెల్మెట్ వాడకంవల్ల తల గాయాలను నివారించవచ్చని, అదే విధంగా ఇది ప్రజల భద్రతకుఎంతోకీలకమని ఆయన తెలియజేశారు,హెల్మెట్ అనేది కేవలం ఒక రక్షణకవచం మాత్రమే కాదు అని, కుటుంబానికి భద్రత కల్పించే సాధనం అని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని తెలియజేశారు,ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలకు ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్ ధరించే విధంగా సలహా ఇవ్వాలని, ఇది పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో అవసరమని అన్నారు, ఏదైనా రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా, మానసిక శోభకు కూడా గురి చేస్తుందని ఆయన ప్రజలను చైతన్యవంతులుగా చేసే విధంగా తన ప్రసంగం ప్రసంగం ద్వారా తెలియజేశారు, అదేవిధంగా ప్యారా లీగల్ వాలంటీర్లు వినూత్న రీతిలో ద్విచక్ర వాహనదారులకు రోజా పూలు అందజేసి, ప్రతిరోజు మీరు ప్రయాణం చేసే సమయంలో మీ ప్రయాణం ఒక పూల బాట కావాలని, అది హెల్మెట్ ధరిస్తే తప్పనిసరిగా పూలబాటవుతుందని, లేకపోతే ముల్లబాటవుతుందని ద్వి చక్ర వాహనదారులు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని మీ ప్రయాణం సుఖ మయం కావాలని మీ కుటుంబం బాగుండాలని వారు రోజా పూలతో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. న్యాయవాదులు, పోలీసులు, అందరూ తమ వంతు బాధ్యతాయుతంగా హెల్మెట్ గురించి ప్రజలలో అవగాహన పెంచడమే కాకుండా, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది , కార్యక్రమంలో ఎల్ ఈ డి సి ఎస్ శాంత, మనోహర్, పారా లీగల్ వాలంటీర్ దశరథ రామిరెడ్డి, ఏఎస్ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య, శ్రీరాములు, శ్రీకాంత్, మహిళా పోలీసులు లక్ష్మి, ప్రతిభ, చంద్రకళ లీలారాణి ,ఉమామహేశ్వరి, నాగజ్యోతి, సువర్ణ, రాజేశ్వరి ,కళావతి, కౌసర్ తదితరులు పాల్గొన్నారు.