మౌలిక సదుపాయాలు కల్పించి టిడ్కో గృహాలు అందిస్తాం.. రాష్ట్ర మంత్రి
1 min readపేదలకు నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి భరత్
జగన్నాథగట్టుపై రూ.1.38 కోట్లతో మహిళా మార్ట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పేదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించిన టిడ్కో ఇళ్లు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు అందజేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. పేదలకు నివాసం కల్పించాలనే ఉద్దేశంతోనే గతంలో టిడిపి ప్రభుత్వం టిడ్కో గృహాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నగర శివార్లలోని జగన్నాథ గట్టు పై కర్నూలు నగరపాలక సంస్థ పి యం ఏ వై(అర్బన్) టీడ్కో కాలనీ నందు రూ.1.38 కోట్లతో నిర్మించనున్న మహిళా మార్ట్ నిర్మాణానికి మంత్రి టి.జి. భరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు నివాసాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా టీడ్కో గృహ నిర్మాణాలు చేపట్టిందన్నారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం మిగిలిన నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. కేవలం చంద్రబాబు నాయుడుకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే టిడ్కో ఇళ్లను పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వం రంగులు వేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. టిడ్కో గృహాల కోసం లబ్దిదారులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారన్నారు. చివరి దశలో ఉన్న ఈ గృహాలను త్వరలో అన్ని మౌలిక వసతులతో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటి పర్యటన చేపట్టినపుడు చాలామంది లబ్ధిదారులు టిడ్కో గృహాల విషయంలో చాలా సమస్యలు తనకు తెలిపారన్నారు. వీటన్నింటినీ తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మహిళా మార్ట్ ద్వారా టిడ్కో నివాసితులకు రీజనబుల్ ధరలకే సరుకులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు నగరానికి తలమానికముల ఈ గృహాలను ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి దేఅని అన్నారు. మన ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అని ఈరోజు మహిళల కొరకు మార్ట్ లను ఏర్పాటు చేపిస్తున్నారని అందులో భాగంగానే ఇక్కడ మహిళా మార్ట్ కు శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ఈ గృహాలలో ప్రస్తుతం 50 కుటుంబాలు నివాసం నివాసం ఉన్నాయని. వీరికి మౌలిక వసతులు కూడా కల్పించామని, గృహాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రస్తుతం నీటి సౌకర్యాలు కూడా కల్పించామన్నారు. నివాసితుల కొరకు త్వరలో మహిళా మార్ట్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నామని అందుకుగాను ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా మంత్రివర్యుల చేతుల మీదుగా చేయడం జరిగిందన్నారు.పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గృహాలకు అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు త్వరలో అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. మన ప్రభుత్వం మహిళా పక్షపాతిఆని ఇందుకు ఉదాహరణ ఓర్వకల్లులోని మహిళలే అని ఎమ్మెల్యే అన్నారు. ఓర్వకల్లులోని మహిళా గ్రూపు జిల్లాలో, రాష్ట్రాలలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చారని ఎమ్మెల్యే అన్నారు. కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గృహాలను సర్వ సుందరంగా తీర్చిదిద్ది మౌలిక వసతులను త్వరలో కల్పించి లబ్ధిదారులకు ఇవ్వనున్నారని ఎమ్మెల్యే అన్నారు. అంతకుముందు మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు టిడ్కో గృహాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ,ఏపీ టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, డీఈ లు హరికృష్ణ, రవికుమార్ గుప్త, పవన్ కుమార్, ఏఈ లు కౌశియా, వి నాయక్, మహిళా మండలి అధ్యక్షురాలు ముంతాజ్, గౌసియా, తదితరులు పాల్గొన్నారు.