ఆలూరు మండల ప్రజాపరిషత్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండల కేంద్రంలో జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే విరుపాక్షి ఆలూరు మండలంలో ఉండే ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక.ముందుగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే విరుపాక్షి ని సన్మానించడం జరిగింది ఆ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరైరు.ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం విచ్చేస్తున్న సందర్భంగా ముందుగా గ్రామాలలో అతి సార వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పరిశుభ్రత ఉండేటట్లు చేయాలని మురికివాడలో శానిటేషన్లు చేసి గ్రామాలు నీటిగా ఉండేటట్లు చూడాలని అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ప్రమాద స్థాయిలో ఉంటే వాటికి సత్వర చర్యలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని ఎక్కడైనా రోడ్లు గుంతల మయంగా ఉంటే మట్టితో పూడ్చాలని తెలపడం జరిగింది.అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి ప్రోటోకాల్ పాటించాలి ప్రోటోకాల్ పాటించని యెడల పై అధికారుల దృష్టికి తీసుకుపోయి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మరియు జడ్పిటిసి ఎంపీడీవో అన్ని గ్రామాల ఎంపీటీసీలు అన్ని గ్రామాల సర్పంచులు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అధికారులు పాల్గొన్నారు.