PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న్యాయ విజ్ఞాన సదస్సు,ర్యాలీ .. హెల్మెట్ల పంపిణీ:”

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప:   జులై 20 కడప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి సూచనల మేరకు,గరికపాటి దీన బాబు,నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి,అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,కడప . కె ప్రత్యూష కుమారి,అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎఫ్ ఎ సి సెక్రటరీ,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,కడప వారు “ద్విచక్ర వాహనాలు మరియు పిలియన్ డ్రైవర్ల వినియోగదారులు రక్షిత తలపాగా (హెల్మెట్) ఉపయోగించడంపై  హైకోర్టు డబ్ల్యూపి. పిల్ నంబర్:116/2024లో ఆదేశాలు జారీ మొదలగు అంశాల అవగాహన కొరకు న్యాయ సేవా సదన్ కడప నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్ ధరించండి – సురక్షితంగా గమ్యాన్ని చేరండి, హెల్మెట్ ధరించండి ప్రమాదాలను నివారించండి, సెక్షన్ 129/194 డి మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ చట్టము, సెక్షన్ 304-ఏ ఐపీసీ,196 ఆఫ్ బి ఎన్ ఎస్ యాక్ట్,180,181, 183,184,185, రూల్ 167-ఏ ప్రకారం రోడ్డు భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరాలైన స్పీడ్ కెమెరా, క్లోజ్డ్ సర్క్యూట్,టెలివిజన్ కెమెరా,స్పీడ్ గన్,బాడీ వేరిబుల్ కెమెరా,తదితర టెక్నాలజీ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు వాడుతున్నట్లు తెలిపారు, హెల్మెట్ వాడకపోవడం చట్టరీత్యా నేరము, మనల్ని మన కుటుంబాన్ని రక్షించుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలి, మనము హెల్మెట్ వాడి నలుగురికి ఆదర్శంగా ఉండాలి, ఐ ఎస్ ఐ మార్క్ గల నాణ్యమైన హెల్మెట్లను వాడాలి, హెల్మెట్ ధరించడం పై అవగాహన పెంచుకోవాలి.కార్యక్రమం అనంతరం కెనరా బ్యాంక్ వారి సహకారంతో హెల్మెట్లను గిరిజనులకు,కార్మికులకు,ట్రాన్జెండర్లకు,పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది.అనంతరం కోర్టు ఆవరణము నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో కడప బార్ ప్రెసిడెంట్ బొగ్గుల గుర్రప్ప, న్యాయవాదులు,పారా లీగల్ వాలంటరీలు,ప్యానల్ న్యాయవాదులు, ఎన్జీవోలు, ట్రాన్స్ జెండర్లు,గిరిజనులు, కార్మికులు,కోర్టు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

About Author