సాంఘిక ,సంక్షేమ హాస్టల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని అసెంబ్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ సాంఘిక, సంక్షేమ వసతి గృహాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. ప్రభుత్వ బి. సి బాలికల వసతి గృహాన్ని ఆదోని లోని విక్టోరియా పేట గుజరాతి పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలైనటువంటి నాణ్యమైన భోజనం, మంచి త్రాగునీరు, విద్యార్థులకు అవసరమైనటువంటి బెడ్ షీట్లు, హాస్టల్ కు అవసరమైనటువంటి వర్కర్స్,తదితరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్లో యొక్క ప్రభుత్వ భవనాల కొరకు ఇంజనీర్ సెక్షన్ ద్వారా ప్లాన్ చేసి విజయవాడలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధించేందుకు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఏదేమైనాప్పటికీ సాంఘిక, సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు మార్పు చేసి చూపిస్తామని అన్నాను. ఈ కార్యక్రమంలో MLC మధుసుదన్, BC welfare జిల్లా అధికారి వెంకటలక్ష్మి ,MEO శ్రీనివాసులు,Aswo, వార్డెన్లు విశ్వనాథ్ రెడ్డిగారు , ప్రమీలమ్మ , అనిమి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.