నామినేటెడ్..ఆశల పల్లకిలో నేతలు..
1 min readఇప్పటికే వివరాలు సేకరించిన రాష్ట్ర నాయకత్వం
జెండా మోసిన వారికే పదవులు
ఈ నెలాఖరులోపే మొదటి విడత
నందికొట్కూరులో ఎమ్మెల్యే.. శివానందరెడ్డి ఆశీస్సులు ఉన్నవారికే నామినేటెడ్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి(టిడిపి జనసేన బిజెపి)ప్రభుత్వం అధిక స్థానాలతో కైవసం చేసుకోవడం తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం నెల రోజులు దాటింది.ఇక నామినేటెడ్ పదవులపై పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయానికి వివరాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదవులు నామినేటెడ్ కార్పొరేషన్లు ఇతర పదవుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది ముఖ్యమైన కార్పొరేషన్లు వందకు పైగా తేలాయి.కుల వృత్తులకు సంబంధించిన ఫెడరేషన్ లో 60 దాకా ఉన్నాయి ఇవే కాక నీటి సంఘాలు ఆహార సంఘాలు వేల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మంది ఆశావహులు ఉన్నారు. నామినేటెడ్ పదవులు ఈ నెలలో కొన్ని అయినా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఈ పదవుల్లో టిడిపి తో పాటుగా జనసేన బిజెపి నేతలకు కొన్ని పదవులు ఇవ్వాలని టిడిపి రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ఆగస్టు చివరిలోపు అన్ని పదవులను పూర్తి చేయాలనే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు.ఎన్నికల ముందు పార్టీ జెండా మోసిన వారికే ఇవ్వాలని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఎవరెవరికి ఏ ఏ పదవులు కట్టబెట్టాలనే యోచనలో పార్టీ నాయకత్వం ఉంది.ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రమే పదవులు వస్తాయని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఎమ్మెల్యే..శివానందరెడ్డి ఆశీస్సులు ఎవరికో ఆశావహుల్లో నేతలు:నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో 20 ఏళ్ల నుండి పసుపు జెండా ఎగరలేదు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు బ్రదర్స్ అందరూ టిడిపి అభ్యర్థి గిత్త జయసూర్య 9792 మెజార్టీతో గెలుపుకు అన్నీ తానై తమ సత్తా ఏంటో నిరూపించి జెండాను రెపరెప లాడించారు.నియోజవర్గంలో పార్టీ గెలుపుకు మండలాల కన్వీనర్లు నాయకులు ఎంతో కష్టపడ్డారు.మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కుల సామాజిక పరంగా నామినేట్ పదవులు వరించబోతున్నాయి. మరి ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి వీరి ఆశీస్సులు ఉన్నవారికే పదవులు వస్తాయ నడంలో చెప్పనవసరం లేదు.
మార్కెట్ యార్డ్ సొసైటీ చైర్మన్ లు ఎవరికో:
కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పదవులను తొలగించింది.మరి ఖాళీగా నందికొట్కూరు పట్టణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గిరి కోసం ఎవరికి వారు పోటీ పడుతున్నారు.అంతే కాకుండా వీటిలో డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి.తాలుకాలో 7 సహకార సొసైటీలు బ్రాహ్మణ కొట్కూరు,నందికొట్కూరు, మిడుతూరు,జూపాడుబంగ్లా, కొత్తపల్లి,పాములపాడు మండలంలో నాంపల్లి,మద్దూరు సొసైటీలు ఉండగా ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు మాత్రమే పదవులు కట్టబెట్టే యోచనలో ఎమ్మెల్యే జయసూర్య..శివానందరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.పార్టీ గెలిచిన తర్వాత టీడీపీ పార్టీలోకి వచ్చిన వారికి పదవులు రాకపోవచ్చు అనేది స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే..మరి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు ఎవరెవరికి వస్తాయనేది వేచి చూడాల్సిందే.