ఓర్వకల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: మండల కేంద్రంలోని ఓర్వకల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి శనివారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులు ఉండగా ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉండడంతో. మధ్యాహ్నం ఒంటిగంటకు కావస్తున్న ఆసుపత్రిలో మిగిలిన వైద్యులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు… రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించే సహించేది లేదని తెలిపారు. కొత్త ఆసుపత్రి నిర్మించిన పాత ఆసుపత్రిలోనే వైద్య సేవలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.. ఆస్పత్రికి వచ్చిన రోగులకు సరైన సేవలు అందించి మెరుగైన చికిత్స చేయాలని ఆదేశించారు. రాత్రి వేళలో రోగులకు వైద్యుల అందుబాటు లేకపోవడంపై ఎమ్మెల్యే ఆరా తీశారు.. రోగులకు సరైన చికిత్స అందించాలని ఆసుపత్రి లోని సిబ్బందికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పలు సూచనలు చేశారు… ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ మండల కన్వీనర్ గోవిందరెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.