పట్టణ ప్రజల ఆరోగ్యాలు పట్టని మున్సిపల్ కమిషనర్
1 min readఎల్ఎల్సీ కాలంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మున్సిపల్ అధికారులు విఫలం
జి.రంగన్న సిపిఐ పట్టణ కార్యదర్శి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో తుంగభద్ర ప్రాజెక్టు నుండి రెండు,మూడు రోజులలో ఎల్ఎల్సీ కాల్వ కు నీరు వస్తున్న సందర్భంలో ఎమ్మిగనూర్ ఫైర్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎల్ఎల్సీ కాలువ లో పడి ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందారని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జి.రంగన్న తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణ ప్రజల ఉపయోగించే నీరు ఎల్ ఎల్ సి కాలువ ద్వారా వచ్చే నీరును పట్టణ ప్రజలు ఉపయోగించడం జరుగుతుందని,కానీ ఎల్ఎల్సీ కాలువలో వ్యర్థ,విష పదార్థాల పడి ఉండడంతో ఆ వ్యర్థ పదార్థాలను తొలగించకపోతే తుంగభద్ర ప్రాజెక్ట్ నుండి వచ్చే నీరు కలుషితమై ఆ నీరును పట్టణ ప్రజలు తాగితే అనారోగ్యాలకు బారిన పడే ప్రమాదం ఉందని వారు తెలిపారు. వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మున్సిపల్ అధికారుల మౌనం వెనుక అర్థం ఏమిటో తెలియడం లేదని,అంటే పట్టణ ప్రజల ఆరోగ్యాలు మున్సిపల్ అధికారులకు పట్టవా అనీ వారు తెలిపారు. ఈ వ్యర్థ పదార్థాలు తొలగించలనీ గతంలో సిపిఐ గా ఎల్ఎల్సీ కాలువ దగ్గర నిరసన చేయడం జరిగిందని, అయినా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో పట్టణ ప్రజల ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఎల్ఎల్సీ కాలువ లో పడి ఉన్న విష, వ్యర్థ పదార్థాలను ఎత్తివేయాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని వారిచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు భాస్కర్ యాదవ్, సమీవుల్లా,మల్లికార్జున గౌడ్, వీరేష్,రవి,కృష్ణ,కాజా నరసింహులు,సుంకన్న,అజార్, రామాంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.