క్రీడాభివృద్ధికి సౌకర్యాలు కల్పించండి- ఎమ్మెల్యే పార్థసారథి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని నియోజకవర్గంలో ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలు, ప్లేగ్రౌండ్‌లు, ప్రేక్షకులకు కూర్చోవడానికి సౌకర్యాలు కల్పించాలని ఆదోని ఎంఎల్ఏ డా!! పార్థ సారథి యువత మరియు క్రీడా శాఖ కార్యదర్శి వినయ్ చంద్ గారిని సోమవారం సెక్రటేరియట్లో కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాడ్మింటన్ కోర్ట్‌ల కోసం అధిక నాణ్యత గల మలేషియన్ వుడ్ ఫ్లోరింగ్‌తో సహా సమగ్ర క్రీడా సౌకర్యాలను సమకూర్చాలని కోరారు. లైటింగ్, టర్బో ఫ్యాన్లు, క్రికెట్ పిచ్, గడ్డి, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, టెన్నిస్, షటిల్, క్రికెట్, అథ్లెటిక్స్ గ్రౌండ్‌లకు అవసరమైన పరికరాలు కూడా సమకూర్చలన్నారు. నెట్‌లు, గోల్‌పోస్టులు, ట్రాక్ లైన్‌లు, ఫుట్‌బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్ మరియు అథ్లెటిక్స్ కోసం అవసరమైన ఇతర పరికరాలతో సహా సమగ్ర సౌకర్యాలు సమకూర్చరన్నారు. దీనివల్ల యువత, క్రీడా ఔత్సాహికులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందన్నారు.