కర్నూలు జిల్లాలో పనిచేయడం చాలా సంతృప్తి నిచ్చింది
1 min readజాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కర్నూలు జిల్లాలో పనిచేయడం చాలా సంతృప్తి నిచ్చింది బదిలీ పై తిరుపతికి వెళ్తున్న కర్నూలు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం తిరుపతి మున్సిపల్ కమీషనర్ గా బదిలీ అయిన నేపథ్యంలో రిలీవ్ అయి వెళుతున్న సందర్భంగా అధికారులను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ ప్రసంగించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ బదిలీల్లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ గా ఉత్తర్వులు వెలువడడం జరిగిందని అందులో భాగంగా రేపు కర్నూలు జాయింట్ కలెక్టర్ బాధ్యతల నుండి రిలీవ్ అయ్యి బుధవారం రోజున తిరుపతి నగరపాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టడం జరుగుతుందన్నారు. విభజన తర్వాత నంద్యాల జిల్లా విధులు నిర్వహించానని అయితే నంద్యాల జిల్లాతో పోలిస్తే కర్నూలు జిల్లాలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్న జిల్లాలో మళ్లీ పోస్టింగ్ రావడం చాలా అదృష్టంగా భావిస్తునన్నారు. అదే విధంగా జిల్లాలో గొడవలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. ఇక్కడి ప్రజలు చాలా మృధుస్వభావులు జిల్లా కొంత వెనుకంజలో ఉన్నప్పటికీ అధికారులే బాధ్యత తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. కర్నూలు జిల్లాలో భవిష్యత్తులో విధులు నిర్వహించే అవకాశం వస్తే తప్పనిసరిగా వినియోగించుకుంటానని తెలిపారు. ముఖ్యంగా ఆదోని సబ్ కలెక్టర్, పత్తికొండ ఆర్డీఓ, కర్నూలు ఆర్డీఓ, అందరూ తహశీల్దార్లు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించారని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల్లో అందరూ మంచి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.సమావేశంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.