పట్టణంలో రోగాలను నియంత్రించాలని కమిషనర్ కు వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు.రైతు సంఘం జిల్లా నాయకులు సోమన్న అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూనంద్యాల జిల్లా నందికొట్కూ రు మున్సిపాలిటీలో 29 వార్డులు దాదాపు 60 వేల జనాభా ఉందని వర్షాకాలం రావడంతో ఆయా కాలనీల్లో డ్రైనేజీలు సరిగ్గా లేక రోడ్ల పైనే నీరు నిలబడి బురదమయంగా ఉందన్నారు.మురుగునీరు నిలిచి దోమలు అధికంగా ఉండడం వల్ల పట్టణంలో డయేరియా మలేరియా అతిసార వ్యాధులు ప్రబలుతున్నాయని పట్టణంలోని ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారని దోమలు డ్రైనేజీ వల్ల రోగాలు పెరిగే అవకాశం ఉందన్నారు. శానిటేషన్ అధికారులు ఎప్పటికప్పుడు బ్లీచింగ్ ఫినాయిల్ ఫాగింగ్ మిషన్ తో దోమల మందు చల్లని మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మెయిన్ డ్రైనేజీ కాలువలో పూడిక తీసి కాలనీలోకి నీళ్లు రాకుండా చూడాలని కోరారు. పట్టణంలో అన్ని కాలనీల్లో బ్లీచింగ్ ఫినాయిల్ దోమల ఫాగింగ్ చేయాలి.వర్షాకాలం వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలి పట్టణంలో డ్రైనేజీ కాలువలకు నిధులు కేటాయించి పనులు చేయించాలి.పట్టణంలోని ఇందిరానగర్ దళితపేటలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ అనుపమ కు సమస్యలు పరిష్కరించాలని మహిళలతో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపేంద్ర,భాస్కర్ గౌడ్,కేశవ గౌడ్,యాకోబు,మౌలాలి, సుధాకర్ స్వామి పాల్గొన్నారు.