తరిగోపులలో విద్యార్థులకు అవగాహన..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జుపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మిషన్ శక్తి 100 రోజుల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.బాలికలకు చిన్న వయసులో వివాహాలు చేయటం వలన వారికి కలిగేటటువంటి నష్టాల గురించి వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పావని హాజరై బాల బాలికలకు లింగ వివక్షత గురించి బాల్య వివాహాలు చిల్డ్రన్ ల్యావ్స్ గురించి పోషణ శక్తి వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంటిలో కానీ ఇంటి బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు మనకు దూరంగా ఉంటాయని అదేవిధంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత తప్పకుండా పాటించాలని నీళ్లను గోరువెచ్చగా చేసి త్రాగాలని ఆమె విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిహెచ్ హైస్కూల్ హెడ్మాస్టర్ సుధాకర్,అంగన్వాడీ కార్యకర్తలు శ్రీదేవి, రామాతులసి,లక్ష్మీప్రసన్న, పాల్గొన్నారు.