PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 అధైర్య పడొద్దు- అండగా ఉంటా

1 min read

ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానం

 మాజీ ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా అధైర్య పడవద్దని, ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యులేనని అందరికీ అందుబాటులో ఉంటూ, అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, ఆయన మంగళవారం చెన్నూరు లోని మైనార్టీ నాయకులు అబ్దుల్ రబ్ నివాసంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశం ఆయన పాల్గొనడం జరిగింది , ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపుకు పాల్పడడమే కాకుండా, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా ఆస్తి నష్టం తోపాటు ప్రాణాలు సైతం తీస్తున్నారని అధికారం శాశ్వతం కాదని, కక్ష సాధింపు మానుకొని అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించాలని ఆయన టిడిపి తీరుపై మండిపడ్డారు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చిందంటే తక్షణమే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని, మనోధైర్యం కోల్పోవద్దని ఆయన కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇచ్చారు, ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, నాయకులు కార్యకర్తలు అందరూ కలసి సమన్వయంగా ఏ సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు, చెన్నూరు టౌన్, అలాగే మండల కార్యకర్తలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, ప్రతి సమస్యను ఆయన సావధానంగా విని, ప్రతి కార్యకర్త సమస్యకు పరిష్కార మార్గం అయ్యేవిధంగా ఆయన వారితో సంభాషించడం జరిగింది, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, మండలంలోని ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలను పలకరించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది, ఆయన కార్యకర్తలకు, నాయకులకు నేనున్నాను అంటూ భరోసా ఇవ్వడంతో, కార్యకర్తలు నాయకులు ఆయనకు తమ సమస్యలను చెప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఆర్ వి ఎస్ ఆర్, ముదిరెడ్డి రవిరెడ్డి, ఎర్ర సాని మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మైనార్టీ నాయకులు, అన్వర్ భాష, అబ్దుల్ రబ్, వారిస్, మునీర్ అహ్మద్, జుమన్, హస్రత్, సాదిక్ అలీ, వైయస్సార్ సిపి మహిళా నాయకురాలు భాగ్యమ్మ, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

About Author