అక్రమ ఇసుక రవాణాపై కుక్కునూరులో టాస్క్ ఫోర్స్ దాడులు
1 min readపరిమితికి మించి ఇసుక తరలిస్తున్న లారీని అడ్డుకున్న డిపిఓ, టాస్క్ ఫోర్స్ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం కాగా కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇసుకని పరిమితికి మించి ఖమ్మం వైపు తరలించుకు పోయే ప్రయత్నాన్ని ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ నేతృత్వం లో కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు టాస్క్ పోర్స్ అధికారులు మంగళవారం అక్రమ ఇసుక రవాణాను భగ్నం చేశారు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో పోలవరం డియస్పి, డిడి మైన్స్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిమితికి మించి ఉన్న లారీలను లంకాలపల్లి నుంచి అశ్వారావుపేట కాటాకు తరలించి క్వాంటిటిని తూకం వేశారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని డీపీఓ మరియు జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు ఇసుక అక్రమ రవాణా దారులను హెచ్చరించారు, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేవిధంగా ఉండదని హితవు పలికారు. అయితే కొంత మంది అక్రమార్కులు ఇవేవి తగదనికుక్కునూరు మండలం, ఇబ్రహీంపేట ఇసుక డిపో నుంచి పరిమితికి మించి ఇసుకను తీసుకెళ్తున్న మూడు తెలంగాణ లారీలను పట్టుకున్న ట్టు డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చే ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరగకూడదని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేవిధంగా ఉండదని హితవు పలికితే కొంత మంది అక్రమార్కులు ఇవేమి పట్టనట్లు ధనార్జన లక్ష్యంగా ఉచిత ఇసుక విధానాన్ని అక్రమంగా వాడుకుంటున్నారు.అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి పేదలకు ఇచ్చే ప్రభుత్వ ఉచిత విధానంలో అక్రమాలు సహించమని గట్టి సందేశాన్ని పంపించిన కలెక్టర్ వేత్రిసెల్విని జిల్లా ప్రజలు ప్రశంసలతో ముంచేత్తగా కలెక్టర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అడుక్కున్నా డీపీఓ , టాస్క్ ఫోర్స్ సభ్యులు పోలవరం డియస్పి యన్ సురేష్ కుమార్ రెడ్డిని పలువురు అభినందించారు.