ఏపీ రాష్ట్ర నీటి హక్కులను కాపాడుతాం..
1 min readరాయలసీమ నీటి సమస్యల పరిష్కారానిపై సమగ్రమైన చర్యలు చేపడుతాం
మంత్రి నిమ్మల రామానాయుడు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖామాత్యులు NMD ఫరూఖ్ గారి ఆద్వర్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ప్రచార కార్యదర్శి నిట్టూరు సుధాకర్ రావు లు జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడిని బుధవారం శాసనసభా ప్రాంగణంలో కలిసారు. ఆంధ్రప్రదేశ్ సాగునీటి హక్కులకు మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, నాగార్జునసాగర్ ఆయకట్టుకు సంబంధించి సాగునీటి హక్కులకు విఘాతం కలిగించే విధంగా కేంద్రం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఎస్.వో. 4375(ఈ) తేదీ 6.10.2023, రద్దుకు కృషి చేయాలని జలవనరుల శాఖామాత్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై తగిన కార్యాచరణ చేపడతామని మంత్రి సానుకూలంగా స్పందించారు.రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణకు కీలకమైన విధాన పరమైన నిర్ణయాలు, రాయలసీమ హక్కుగా ఉన్న నీటిని పొందడానికి అవసరమైన మౌళిక మైన నిర్మాణాలకు సంబంధించిన వినతి పత్రంను బొజ్జా మంత్రికి ఈ సందర్భంగా అందచేసారు. రాయలసీమ అంశాలపై జలవనురుల శాఖ మంత్రి సమగ్రంగా చర్చించడానికి సానుకూలంగా స్పందించారు. దీనికై జలవనురుల శాఖ మంత్రి మరియు రైతులతో ఒక సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేపడతానని న్యాయ శాఖ మంత్రి ఫరూక్ హామి ఇచ్చారు.