ప్రత్తి పంటల పరిశీలించిన శాస్త్రవేత్త..
1 min readమిడుతూరు మండలంలో పత్తి పంటపై రైతులకు అవగాహన
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కో.ఆర్డినేటర్ డా. రామకృష్ణా రావు,మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ మండలంలోని తలముడిపి,మిడుతూరు, నాగలూటి,కడుమూరు గ్రామాల్లో బుధవారం పత్తి పంటలను పరిశీలించారు.ప్రస్తుతం పత్తి పంటలో రసం పీల్చు పురుగులు(పచ్చదోమ, తామర పురుగులు)మరియు మెగ్నీషియం దాతు లోపాలు పంటలను నాశనం చేస్తున్నాయని రసం పీల్చే పురుగులు నివారణ కోసం రైతులు ఈ క్రింది నివారణ చర్యలు చేపట్టాలని రామకృష్ణారావు,ప్రిన్సిపాల్ సైంటిస్ట్ రైతులకు సూచించారు.రసం పీల్చు పురుగుల నివారణకు గాను ఎకరానికి వేప నూనె 10 వేల పీపీఎం 200 మి.లీ.కలిపి పిచికారీ చేయాలని మరియు ఎకరానికి 25 పసుపు,25 నీలి రంగు జిగురు అట్టలను పొలంలో పెట్టుకోవాలన్నారు.మెగ్నీషియం దాతు లోప నివారణకు గాను ఎకరానికి 2 కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని రైతులకు సూచించారు.పత్తి పంటలో సమగ్ర సస్య రక్షణ పద్ధతుల ద్వారా గులాబీ రంగు పురుగు యాజమాన్యం ప్రదర్శన క్షేత్రాలను తలముడిపి మరియు మిడుతూరు గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గులాబీ రంగు పురుగు నివారణకు గాను లింగా కర్షక బట్టలు ఏకరాని 10 చొప్పున ఉండాలని రైతులకు సూచించారు.లింగాకర్షక బుట్టలను పత్తి పంట పొలంలో ఎలా పెట్టుకోవాలో రైతులకు చూపించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ‘రైతు సేవ కేంద్రాల విఏఎస్ లు సరస్వతి,అశోక్,ప్రమీల పాల్గొన్నారు.