గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించారు-రెడ్డి గౌతమ్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: వైసిపి ప్రభుత్వం లో అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టి వేధించారని బాధితుడు రెడ్డి గౌతమ్ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం జరిగేలా చూడాలని రక్షణ కల్పించాలని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మేరకు బుధవారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో విశాఖపట్నం జిల్లా చోడవరం నివాసి రెడ్డి గౌతమ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశలో ఆయన మాట్లాడుతూ2019లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనను కక్షపూరితంగా నిర్బంధించి తన ఆస్తులను లాక్కోవాలని ప్రయత్నించారని, కేసులు పెట్టి హింసకు గురి చేశారని తెలిపారు. 2019లో తనపై అక్రమంగా కేసులు పెట్టినప్పుడు లాయర్ రవితేజ న్యాయపోరాటం చేశారని, ఆ క్రమంలో రెడ్డి గౌతమ్ కేసులో పౌర హక్కుల ఉల్లంఘన జరిగిందని అప్పటి హైకోర్టు వ్యాఖ్యానించింది అని తెలిపారు. అరాచక పాలన సాగించిన మాజీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం తనకు రక్షణ కల్పించి న్యాయసహాయం చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరారు.