సీఎం చంద్రబాబు పట్టుదల, కేంద్రం ప్రోత్సాహంతో రాష్ట్రం అభివృద్ధి..
1 min readరాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
చంద్రబాబు నాయుడు కృషి వల్లే కేంద్ర బడ్జెట్‌లో వరాలు జల్లు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానంతో రాష్ట్రాన్ని పారిశ్రామికాభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడం సానుకూల పరిణామమని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర అభివృద్ధి కోసం మరిన్ని ప్రాజెక్టులు, సంస్కరణలు అమలు చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రానికి నిధులు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని మంత్రి టి.జి భరత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ బలపడిన ప్రభావమే బడ్జెట్‌లో రాష్ట్రానికి అవసరమైన వనరులు పొందడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు వీలుగా విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్లోని కొప్పర్తి, హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్లోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో నీరు, విద్యుత్తు, రైల్వే, రహదారి కల్పనలాంటి మౌలిక వసతులకు నిధులు అందించేందుకు బడ్జెట్‌లో హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులాంటి విజనరీ లీడర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రి టి.జి భరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.