భారత్ క్రీడాకారులకు మద్దతుగా ర్యాలీ
1 min readపతకాల ఆశతో ఉన్నాం-టీజీ
పతకాలతో వస్తే మాకు స్ఫూర్తి-డా:శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్యారిస్ ఒలంపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటి భారతావనికి వన్నె తెస్తారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ.వెంకటేష్ వాఖ్యానించారు.గురువారం ఉదయం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో కేజీ వెంకటేష్ తో పాటు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డా: బి .శంకర్ శర్మ, సెకండ్ ఏపీ .ఎస్పీ. బెటాలియన్ డిఎస్పి షేక్ మహబూబ్ బాషా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దేశ క్రీడా రంగానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైతే క్రీడలు, కళలులు వికసిస్తాయో అక్కడే శాంతి సమగ్రత సౌబ్రాత్మత్వం ఉంటుందన్నారు.డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మన రాష్ట్ర క్రీడాకారులకు ఒలంపిక్ లో పాల్గొనే అవకాశం కలగడం అదృష్టంగా ఉంద న్నారు. పతకాల కోసం ఎదురుచూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.భారత ఒలంపియన్లకు మద్దతుగా క్రీడా సంఘాలు, క్రీడాకారులు, క్రీడా శ్రేయోభిలాషులు ర్యాలీ చేయడం హర్షనీయమన్నారు.స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ స్టేట్ బ్యాంక్ సర్కిల్, చిన్న పార్క్, కోట్ల సర్కిల్, కోర్స్ కళాశాల మీదుగా కొండారెడ్డి బురుజు వరకు సాగింది, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో క్రీడా సంఘ ప్రతినిధులు హర్షవర్ధన్, నాగరత్నమయ్య ,వంశీ నవీన్, గుడిపల్లి సురేందర్, జాఫర్ మున్నా, షేక్షావలి, శ్రీనివాసులు, విజయకుమార్, వేణుగోపాల్, ప్రసాద్, ఎం.ఎం.డి భాష, పరుశురాం, ప్రభాకర్, షకీల్, నవి సాహెబ్, జాకీర్, మధు, చిన్న సుంకన్న, ప్రతాప్ లతోపాటు డి ఎస్ ఏ, సాయి సెంటర్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.