శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు
1 min readపెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయమువద్ద ఈరోజు శ్రీస్వామివారి జన్మనక్షత్రమైన పూర్వభాద్రా నక్షత్రం సందర్భముగా ఆలయ మండపముపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీస్వామివారిని, అమ్మవారిని ఆశీనులను చేసి, అర్చక స్వాములు శాస్త్రోక్తంగా శ్రీస్వామివారి కల్యాణ క్రతువు నిర్వహించారు. సదరు కళ్యాణ క్రతువులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదములు అందజేశారు. ఆలయమునకు విచ్చేసిన భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఏలూరు జిల్లా, ముసునూరు మండలం, చెక్కపల్లికి చెందిన శ్రీరాధాకృష్ణ భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈకార్యక్రమములో పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.